'ఇరుముడి' సంగీతం ఓ సవాల్‌ | Gv Prakash Reacts Irumudi Movie Music | Sakshi
Sakshi News home page

'ఇరుముడి' సంగీతం ఓ సవాల్‌

Aug 20 2026 8:40 AM | Updated on Aug 20 2026 8:40 AM

Gv Prakash Reacts Irumudi Movie Music

‘‘ఇరుముడి’ సినిమాలో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ... ఇలా అన్ని భావోద్వేగాలున్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్‌గా బ్యాలెన్స్‌ చేశాను. ఈ సినిమాకి మ్యూజిక్‌ చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ చెప్పాడు. రవితేజ, ప్రియా భవానీ శంకర్‌, బేబీ నక్షత్ర కీలక పాత్రలు చేసిన సినిమా ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఆగస్టు 21) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘‘శివ నిర్వాణ ‘ఇరుముడి’ కథ చెప్పినప్పుడు అందులో లీనమయ్యాను. ఈ మూవీ మ్యూజిక్‌ విషయంలో రవితేజ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా భావోద్వేగంగా రూపొందిన క్లైమాక్స్‌ పాట అంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు మాత్రం ‘యాలాలో..’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మలాంటి పాట. నెలలో 15 రోజులు హీరోగా నేను చేసే సినిమాల్లో నటిస్తాను. మరో 15 రోజులు కంపోజింగ్‌లో ఉంటాను. ‘జనవరి 12 విడుదల’ పాటలు అద్భుతంగా వస్తున్నాయి. దుల్కర్‌ ‘ఆకాశంలో ఒక తార, శ్రీ శ్రీ’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. నటుడిగా నేను చేస్తున్న ‘ఇమ్మోర్టల్‌’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 4న రిలీజ్‌ కానుంది అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement