రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా | Mister Middle Class Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: సైలెంట్‌గా ఓటీటీలో తెలుగు మూవీ స్ట్రీమింగ్

Aug 20 2026 6:05 AM | Updated on Aug 20 2026 6:05 AM

Mister Middle Class Movie OTT Streaming Now

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వీటిలో విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', మహేశ్ అన్న కొడుకు హీరోగా చేసిన 'శ్రీనివాస మంగాపురం', ప్యార్ ప్రేమ కల్యాణం, వెల్కమ్ టూ ద జంగిల్ తదితర తెలుగు స్ట్రెయిట్, హిందీ చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే లేటెస్ట్ తెలుగు మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

శ్రీకాంత్ హీరోగా చేసిన కొత్త సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్'. రాజేంద్ర ప్రసాద్, వేంకటేశ్వర స్వామి పాత్రలో నటించాడు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ అంతంత మాత్రంగానే ఉండటంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు నెల పూర్తయ్యేసరికి ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.

'మిస్టర్ మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. వెంకటరమణ (శ్రీకాంత్) మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు, రోజువారీ కష్టాలతో బతికేస్తుంటాడు. అలాంటి ఈయనకు ఓ రోజు ఊహించని విధంగా సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి (రాజేంద్ర ప్రసాద్) ప్రత్యక్షమై ఓ పుస్తకాన్ని ఇస్తాడు. అందులో ఏది రాస్తే అది నిజమవుతుంది. మొదట ఓ వరాన్ని తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాడు. కానీ కోరికలు తీరుతున్నకొద్దీ రమణలో ఆశ కూడా పెరుగుతుంది. తాను రాసిన ప్రతి మాట నిజమవుతుందని నమ్మి తీసుకునే నిర్ణయాలు క్రమంగా కొత్త సమస్యలకు దారితీస్తాయి.

ఇంతకీ ఆ పుస్తకానికి ఉన్న అసలు నిబంధన ఏంటి ? దేవుడు రమణకు ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోరికలను నిజం చేసుకునే క్రమంలో ఏ తప్పులు చేశాడు? చివరికి ఆ శక్తులున్న పుస్తకం రమణ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? అనేది మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement