కోడలు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. అప్పటివరకూ అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. అయితే ఆ అమ్మాయి ప్రవర్తన చూసి, ఆమె ఓ మంత్రగత్తె అని ఆమె బావ అనుమానిస్తాడు. అక్కణ్ణుంచి మిగతా కథేంటో తెలియాలంటే హిందీ చిత్రం ‘నయీ నవేలీ’ చూడాల్సిందే.
కోడలి పాత్రలో యామీ గౌతమ్ నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అక్టోబరు 16న విడుదల చేయనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. కామెడీ, హారర్, ఫాంటసీ ఇలా పలు షేడ్స్ ఉన్న బాబీ (వదిన) క్యారెక్టర్‌కి యామీ గౌతమ్ పర్ఫెక్ట్ అని ఆనంద్ ఎల్.రాయ్ పేర్కొన్నారు.
Yami Gautam's Nayyi Navelli set for Dussehra Festive Release#YamiGautam #NayyiNaveli #Dussehra @yamigautam@aanandlrai @directormbalaji @divynidhisharma@gvprakash @amzmgmstudiosin @colouryellow_in pic.twitter.com/KzDmXLbG5i
— Jayaraman (@JournoJRaman) August 19, 2026


