హీరో సూర్య పాడిన పెళ్లి పాట రిలీజ్ | Suriya Viswanath And Sons Movie Wedding Song | Sakshi
Sakshi News home page

Suriya: 'విశ్వనాథ్ అండ్ సన్స్' వెడ్డింగ్ సాంగ్

Jul 25 2026 7:15 PM | Updated on Jul 25 2026 7:22 PM

Suriya Viswanath And Sons Movie Wedding Song

హీరో సూర్యకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ సినిమా చేశాడు. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వచ్చే నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం 'బటర్ ఫ్లై' పాట విడుదల చేయగా.. ఇప్పుడు సూర్య పాడిన పాటని వదిలారు.

(ఇదీ చదవండి: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు)

'వెడ్డింగ్ సాంగ్' అంటూ సాగే ఈ పాట కలర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: 45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement