యశ్ టాక్సిక్.. రన్ టైమ్ చాలా ఎక్కువే? | Yash Latest Movie Toxic Run Time Locked | Sakshi
Sakshi News home page

Toxic Run Time: యశ్ టాక్సిక్.. భారీగానే రన్ టైమ్..!

Aug 13 2026 10:05 PM | Updated on Aug 13 2026 10:05 PM

Yash Latest Movie Toxic Run Time Locked

కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. మోస్ట్ వయొలెన్స్ అండ్ బోల్డ్‌గా అనిపించింది. అంతకుముందు బోల్డ్ సాంగ్‌పై విమర్శలు రాగా.. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మరిన్ని విమర్శలొచ్చాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా కేవలం పెద్దల కోసమేనని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించి రన్‌ టైమ్‌ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ రన్‌ టైమ్ దాదాపు 3 గంటల 14 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. మూడు గంటలకు పైగా లాంగ్ రన్‌ టైమ్ కావడంపై ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement