breaking news
Eko Movie
-
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
సినిమా ఇలానే తీయాలి, స్టోరీ ఇలానే ఉండాలి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు, రచయితలు డిఫరెంట్ కథలతో మూసధోరణికి భిన్నంగా మూవీస్ తీస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ టైంలో అలా దక్షిణాదిలో హాట్ టాపిక్ అయిపోయిన మలయాళ చిత్రం 'ఎకో'(Eko Movie). థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)కథేంటి?కేరళలోని కాట్టుకున్న అటవీ ప్రాంతంలో ఎత్తయిన ఓ కొండపై మిలాతీ(బియానా మోమిన్) అనే వృద్ధురాలు నివసిస్తూ ఉంటుంది. ఈమె కేర్ టేకర్ పీయూస్(సందీప్ ప్రదీప్). ఈ కుర్రాడిని మిలాతీ కొడుకులు నియమిస్తారు. అలానే మలేసియా జాతికి చెందిన పదుల కుక్కలు.. ఈమెని జాగ్రత్తగా కాపలా కాస్తుంటాయి. అయితే ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్దేవ్) కోసం ఓ నేవీ అధికారి(నరైన్), కురియాచన్ స్నేహితుడు మోహన్ పోతన్(వినీత్) తదితరులు వెతుకుతూ ఉంటారు. ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపిన తర్వాత నుంచి కురియాచన్ కనిపించకుండా పోతాడు. ఇతడు తన కుక్కల సాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడనేది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియాచన్ ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఇంతమంది ఇతడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కల పాత్రేంటి? మలేసియాకు చెందిన మిలాతీ.. కేరళ వచ్చి ఎందుకు బతుకుతోంది? అనేది అసలు కథ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫార్మాట్ అంటూ ఏం ఉండదు. చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా సాదాసీదా స్టోరీలా అనిపించాలి. ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటే ఆశ్చర్యపోవాలి. 'ఎకో' కూడా అలాంటి ఓ మూవీనే. గతంలో 'కిష్కిందకాండం' లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు దింజిత్ అయ్యతన్- రచయిత బహుల్ రమేశ్ కాంబో.. ఇప్పుడు ఈ చిత్రంతో వచ్చారు. మరోసారి హిట్ కొట్టారు. ఆ మూవీలో కోతులు కీలక పాత్ర పోషించగా.. ఇందులో కుక్కలు కీ రోల్ ప్లే చేశాయి.సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి, చివరకు దొరికాడా లేదా? అనేదే మెయిన్ పాయింట్. కాకపోతే ఈ కథకు మలేసియా కుక్కల జాతిని లింక్ చేసి, కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని అడవుల్ని చూపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించారు. ప్రారంభంలో ఏం జరుగుతుందో అర్థం కాక తికమకగా అనిపిస్తుంది కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటికీ ఏదో అర్థం కాలేదే అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే క్లైమాక్స్ నుంచి స్టోరీని వెనక్కి అనాలసిస్ చేసుకుంటూ వెళ్లండి. అప్పుడు అరె భలే తీశార్రా అనిపిస్తుంది.సైకో కిల్లర్స్‌ని చూసి మనం భయపడతాం. కానీ చాలా సాదాసీదా బతుకుతూ తమ పనికి అడ్డం వచ్చేవారిని తెలివిగా తప్పించే వారి గురించి తెలిసినప్పుడు మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్‌తో తీసిన సినిమా. చాలా మలయాళ చిత్రాల్లానే ఇందులోనూ స్లో నెరేషన్ ఉంది. కాకపోతే అడవుల విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. మెయిన్ స్టోరీకి మలేసియాకు చెందిన కుక్కల జాతికి ఉన్న లింక్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్టోరీలో ఉన్న ట్విస్టులు చాలా చిన్నవే కానీ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వల్ల అవి డిఫరెంట్‌గా అనిపిస్తాయి.సినిమాల్లో టెక్నికల్ విషయాలు బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతోనూ చూడొచ్చు. సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్దేవ్, బియానా మోమిన్, వినీత్, నరైన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లందరి సంగతి పక్కనబెడితే అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించగలిగారా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ వాడారో లేదో తెలీదు గానీ మూవీ అంతా చాలా సహజంగా.. మనం కూడా కొండపై, అడవుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్టోరీ నెమ్మదిగా ఉన్నాసరే పర్లేదు డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం 'ఎకో' బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) -
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ వాయిదా
మలయాళంలో ఈ ఏడాది ది బెస్ట్ ఫిల్మ్ అనిపించుకున్న వాటిలో 'ఎకో' ఒకటి. మూవీ లవర్స్ ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలానే ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి తెరపడింది. ఓటీటీలోకి వచ్చింది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి రాకపోవడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడు?నవంబరులో థియేటర్లలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'(Eko Movie). అద్భుతమైన హిట్ అనిపించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఓటీటీలో డబ్బింగ్ వస్తుందని తెలిసి ఆనందపడ్డారు. లెక్క ప్రకారం ఈరోజు(డిసెంబరు 31) అన్ని భాషలు అందుబాటులోకి వచ్చేయాలి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే బుధవారం(జనవరి 07) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)'ఎకో' విషయానికొస్తే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. ఐదేళ్లుగా కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి కోసం చాలామంది వెతుకుతుంటారు. కుక్కల సంరక్షకుడిగా పేరున్న ఇతడికి ఎన్నో నేరాలతో సంబంధముందనేది అందరూ నమ్మే నిజం. భార్య మ్లాతి కూడా ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. నక్సలైట్లని వేధించడంతో పాటు ఎందరినో హింసించడం వెనక ఇతడి హస్తం ఉందని నమ్మి.. పోలీసులు, విలన్స్ వెంటపడుతూ ఉంటారు. అయితే అడవిలో ఉన్న క్రూరమైన కుక్కలకు, బయటకు కనిపించని మాఫియా ప్రపంచానికి లింక్ ఏంటనేదే మిగతా స్టోరీ.కేరళలోని అటవీ ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీయడం విశేషం. గతంలో మలయాళంలో వచ్చిన సూక్ష్మదర్శిని, కిష్కిందకాండం లాంటి డబ్బింగ్ మూవీస్ నచ్చితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. స్టోరీ నెమ్మదిగా సాగుతుంది అనిపించినప్పటికీ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేస్తాయి. 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్దేవ్, సందీప్ ప్రదీప్, వినీత్ తదితరు అదరగొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.(ఇదీ చదవండి: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు) -
కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్లోనే కొత్త ఏడాది రాబోతుంది. అందుకు తగ్గట్లే న్యూఇయర్ సందర్భంగా థియేటర్లలోకి పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ, ఘంటసాల, 45, గత వైభవం తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఎకో అనే మలయాళ డబ్బింగ్ చిత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ అద్భుతమైన హిట్ కావడంతో కొందరు తెలుగు ఆడియెన్స్ దీనికోసం ఎదురుచూస్తున్నారు. హక్ అనే హిందీ మూవీతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్, ఎల్బీడబ్ల్యూ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు)నెట్ఫ్లిక్స్మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) - జనవరి 29ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 31స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01హక్ (హిందీ మూవీ) - జనవరి 02అమెజాన్ ప్రైమ్సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) - డిసెంబరు 29సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02హాట్స్టార్ఎల్బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01సన్ నెక్స్ట్ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01(ఇదీ చదవండి: ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. హీరోయిన్ నిధి అగర్వాల్ ట్వీట్)


