
తమిళ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. అయినా సరే ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 'బైసన్' అనే మూవీ చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో ధ్రువ్‌కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ)
మరోవైపు హిందీలో గతేడాది హిట్ అయిన 'కిల్' చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కోసం ధ్రువ్ విక్రమ్ హీరోగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులోనే ధ్రువ్‌కి జంటగా కాయదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, కేతిక శర్మని తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఒరిజినల్ హిందీ వెర్షన్‌లో ఒక హీరోయినే ఉంటుంది. కానీ తమిళం, తెలుగు భాషల్లోకి వచ్చేసరికి 'కిల్' చిత్ర కథలో మార్పులు చేసి ముగ్గురు హీరోయిన్లని ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)