తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అడపాదడపా మూవీస్ చేసింది. కాకపోతే హిట్స్ దక్కలేదు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఓ హిట్ మూవీ సీక్వెల్‌తో గతేడాది చివరలో వచ్చింది. అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?
అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ కామెడీ సినిమా 'దే దే ప్యార్ దే'. 2019లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన హిట్‌గా నిలిచింది. మళ్లీ గతేడాది నవంబరు 21న దీని సీక్వెల్‌ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడీ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ శుక్రవారం (జనవరి 09) నుంచే హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో' తెలుగు రివ్యూ)
'దే దే ప్యార్ దే 2' విషయానికొస్తే.. తొలి పార్ట్‌లో తనకంటే వయసులో చిన్నదైన ఆయేషాని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమపెళ్లి చేసుకోవాలనుకున్న ఆశిష్(అజయ్ దేవగణ్).. తన మాజీ భార్య(టబు) అనుమతితో పాటు ఆమె కుటుంబ అంగీకారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రెండో పార్ట్‌లో రకుల్ తల్లిదండ్రులైన రాజీ ఖురానా(మాధవన్), అంజు ఖురానా(గౌతమి కపూర్).. ఆశిష్‌తో ఈమె పెళ్లికి అడ్డంకిగా నిలుస్తారు. తనకంటే ఏడాది పెద్దవాడైన ఆశిష్‌తో తన కూతురికి రాజ్ పెళ్లి చేశాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఇకపోతే ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఎకో, 120 బహదూర్, డ్రైవ్, బ్యూటీ, హక్ లాంటి తెలుగ్ స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే ఎపిసోడ్, ఎల్‌బీడబ్ల్యూ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)


