breaking news
De De Pyaar De Movie
-
సీక్వెల్ స్టార్ట్
కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీంతో ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ‘దే దే ప్యార్ దే 2’ను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని అజయ్ దేవగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.ఈ సీక్వెల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ప్రస్తుతం అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్‌కు అకివ్ అలీకి బదులుగా అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫేవరెట్ సినిమా ‘దే దే ప్యార్ దే 2’ సెట్స్‌లో జాయిన్ అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు రకుల్. ఈ చిత్రంలో అనిల్ కపూర్, మాధవన్ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తొలి భాగంలో నటించిన టబు సీక్వెల్లోనూ నటిస్తారా? ఆమె స్థానంలో మరో నటి ఎవరైనా జాయిన్ అవుతారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
రొమాంటిక్ కామెడీ రీమేక్‌లో వెంకీ
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, రీమేక్ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్. గతంలో రీమేక్ సినిమాలతో ఘన విజయాలు సాధించిన ఈ విక్టరీ స్టార్ తాజాగా ఓ బాలీవుడ్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే. ఈ సినిమాలో.. లేటు వయసులో తన వయసులో సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడే పాత్రలో అజయ్ ఆకట్టుకున్నాడు. టబు, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. దీంతో టాలీవుడ్ కన్ను ఈ మూవీపై పడింది. అజయ్ చేసిన పాత్రకు వెంకటేష్ అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు టాలీవుడ్ మేకర్స్. సురేష్ బాబు నిర్మాతగా ఈ రీమేక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్లో బిజీగా ఉన్న వెంకటేష్ తరువాత దే దే ప్యార్‌దే రీమేక్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.