‘దే దే ప్యార్ దే’ రీమేక్‌లో వెంకీ

Venkatesh in Telugu Remake of Bollywood film De De Pyaar De - Sakshi

టాలీవుడ్ సీనియర్‌ హీరో వెంకటేష్‌, రీమేక్‌ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్‌. గతంలో రీమేక్‌ సినిమాలతో ఘన విజయాలు సాధించిన ఈ విక్టరీ స్టార్‌ తాజాగా ఓ బాలీవుడ్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అజయ్‌ దేవగన్‌ హీరోగా ఇటీవల విడుదలైన బాలీవుడ్‌ మూవీ దే దే ప్యార్‌ దే. ఈ సినిమాలో.. లేటు వయసులో తన వయసులో సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడే పాత్రలో అజయ్‌ ఆకట్టుకున్నాడు.

టబు, రకుల్ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. దీంతో టాలీవుడ్ కన్ను ఈ మూవీపై పడింది. అజయ్‌ చేసిన పాత్రకు వెంకటేష్‌ అయితే పర్ఫెక్ట్‌ అని ఫిక్స్‌ అయ్యారు టాలీవుడ్ మేకర్స్‌. సురేష్‌ బాబు నిర్మాతగా ఈ రీమేక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్‌లో బిజీగా ఉన్న వెంకటేష్‌ తరువాత దే దే ప్యార్‌దే రీమేక్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top