
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు అల్లు అర్జున్ (Allu Arjun). బన్నీ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. కుటుంబంతో కలిసి భోజనం చేసి బయటకు వస్తుండగా మీడియా వారి ఫోటోలు క్లిక్‌మనిపించే పనిలో పడింది. ఈ క్రమంలో కెమెరాలు అదేపనిగా ఫ్లాష్ అవుతుండటంతో బన్నీ.. కూతురి కళ్లపై చేయి అడ్డుపెట్టాడు.
కూతురిపై ఎంత ప్రేమో!
అర్హ కళ్లకు ఇబ్బందికలగకుండా కూతురి కళ్లపై చేయి పెట్టే ముందుకు నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కూతురిపై ఐకాన్ స్టార్‌కు ఎంత ప్రేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ చివరగా పుష్ప 2 చిత్రంలో నటించాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకుపైగా రాబట్టింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
చదవండి: ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా!