
మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) మాట్లాడే విధానంపై చాలామంది సరదాగా జోకులేస్తుంటారు. ఆమె యాస.. తెలుగు భాషను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నట్లుగా ఉంటుందని అంటుంటారు. తెలుగును ఖూనీ చేస్తున్నావని విమర్శించేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే లక్ష్మి మాటల్ని చూశాక అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హకు ఓ డౌట్ వచ్చింది.
ఎన్నాళ్లుగానో వెయిటింగ్
తనసలు తెలుగమ్మాయేనా? అన్న ప్రశ్న మదిలో మెదిలింది. మంచు లక్ష్మి కనిపిస్తే అడిగేయాలని ఎన్నాళ్లుగానో వేచి ఉన్నట్లుంది. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చింది. తాజాగా మంచు లక్ష్మి.. సరదాగా కాసేపు బన్నీ ఇంటికి వెళ్లింది. పిల్లలంటే ఇష్టమని చెప్పే ఆమె అర్హ (Allu Arha)తో కబుర్లాడకుండా ఉంటుందా? తనను కూర్చోబెట్టుకుని ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలోనే నన్నేదో అడగాలనుకున్నావంట కదా.. ఏంటది? అని ప్రశ్నించింది.
ఎందుకంత డౌట్?
అందుకు అర్హ.. నువ్వు తెలుగువేనా? అని నవ్వుతూనే క్వశ్చన్ వేసింది. ఊహించని ప్రశ్నకు అవాక్కయిన మంచు లక్ష్మి.. నేను తెలుగే (తెలుగమ్మాయినే) పాప.. నీకంత డౌట్ ఎందుకొచ్చింది? నీతో తెలుగులోనే కదా మాట్లాడాను అని నవ్వేసింది. అయినా ఎందుకలా అడిగావు? అనగా నీ యాక్సెంట్ అట్లానే ఉంది అని నవ్వుతూ బదులిచ్చింది అర్హ. దీంతో లక్ష్మి.. నీ యాస కూడా అలాగే ఉందంటూ అర్హను పట్టుకుని నవ్వేసింది. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌స్టోరీలో షేర్ చేసింది.
LMAO, arha got not chills 🤣😭
[ #AlluArjun • #AlluSnehaReddy • #AlluArha ] pic.twitter.com/8V2zDf027l— Reshmaˢᵃⁱʸᵃᵃʳᵃ ᵉⁿᵗʰᵘˢⁱᵃˢᵗ (@_Reshma_Classy) August 7, 2025