అమ్మవారి సేవలో స్టార్ హీరో.. వీడియో వైరల్! | Kollywood Star Hero Karthi Visits Vijayawada Kanaka Durga temple | Sakshi
Sakshi News home page

Karthi: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో కార్తీ

Sep 30 2024 2:04 PM | Updated on Sep 30 2024 4:18 PM

Kollywood Star Hero Karthi Visits Vijayawada Kanaka Durga temple

కోలీవుడ్ హీరో కార్తీ ప్రస్తుతం సత్య సుందరం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మూవీకి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా హీరో కార్తీ, చిత్రబృందం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.

మూవీ సూపర్ హిట్‌ కావడంతో విజయవాడలో సక్సెస్ మీట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడ చేరుకున్న కార్తీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని తెలిపారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ వచ్చాను.. మా సినిమా చూసి నాగార్జన అభినందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్‌ మూవీ ఊపిరితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నాగార్జునకు తమ్ముడి పాత్రలో అభిమానులను మెప్పించారు.

(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్‌: నాగార్జున)

కాగా.. కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెయ్యజగన్‌. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తెరకెక్కించారు. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతమందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement