MiG-21: అల్విదా.. ఓ అద్భుతమా! | MiG-21 Retirement: Grand Farewell For Warhorse Video | Sakshi
Sakshi News home page

MiG-21: అల్విదా.. ఓ అద్భుతమా!

Sep 26 2025 12:16 PM | Updated on Sep 26 2025 12:30 PM

MiG-21 Retirement: Grand Farewell For Warhorse Video

ఢిల్లీ: భారత వాయు సేనలో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన తురుపుముక్క మిగ్‌-21కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. శుక్రవారం చండీగఢ్‌లోని వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఐఏఎఫ్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌ సహా ఆరుగురు స్క్వాడ్రన్‌ లీడర్లు చివరిసారి పార్టీ నిర్వహించారు. 

‘అద్భుతమైన ఎగిరే యంత్రంగా’.. మిగ్‌–21కు భారత రక్షణ రంగంలో పేరుంది. ఈ యుద్ధ విమానం 1963లో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ ఆరు దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) తన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి.. 870కి పైగా మిగ్‌–21 విమానాలను రష్యా(పూర్వపు సోవియట్‌ యూనియన్‌) కొనుగోలు చేసింది.  

 

తక్కువ ఖర్చుతో.. బలమైన యుద్ధ సామర్థ్యం కలిగిన విమానాలుగా వీటికి పేరుంది. 1965, 1971 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల్లో మిగ్‌–21 విమానాలు పోషించిన పాత్ర అమోఘం. 1999 కార్గిల్‌ యుద్ధంలో, 2019 బాలాకోట్‌ వైమానిక దాడుల్లోనూ ఇది కీలక పాత్ర పోషించింది. గురువారం(సెప్టెంబర్‌ 25) అది తన చివరిసేవలు అందించింది. 

గాలిలో యుద్ధ గుర్రంలా పనిచేసిన ఈ విమానం, దాని భద్రతా ప్రమాణాల్లోనూ వార్తల్లో నిలవడం విశేషం. అందుకే కొందరు దీన్ని ‘ఎగురుతున్న శవపేటిక’.. అని కూడా అభివర్ణించేవారు కూడా. 

శుక్రవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహన్‌, సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, నావికాదళ అధిపతి అడ్మిరల్‌ దినేశ్‌ కె. త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. సూర్య కిరణ్‌ ఎరోబెటిక్స్‌ బృందంతో పాటు స్క్వాడ్రన్‌ లీడర్‌ ప్రియాశర్మ ఈ ఈవెంట్‌కు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement