కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్ సింగ్
రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతోంది
పాక్ మంత్రి రాహుల్‌గాంధీని పొగడటం ఆందోళనకరం
రక్షణ మంత్రి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
రాహుల్ గాంధీలో ఫైర్ లేదు
‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.
రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’
ప్రశంసలో ఆంతర్యమేంటి?
‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్‌ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్‌ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్‌కు అంత సత్తా లేదు’’
400 సీట్లు ఖాయం
‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్‌లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’
సంపద పునఃపంపిణీ సరికాదు
‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్‌పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్‌లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్‌లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్‌లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్‌ఎస్‌పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’
సరిహద్దు చర్చలు సానుకూలం
‘‘ తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’
Comments
Please login to add a commentAdd a comment