
గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ‘విజ్ఞాన్ వైభవ్ 2 కే 25’ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్‌లెన్స్ సంయుక్తంగా జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించాయి.

ఈ సందర్భంగా త్రివిధ దళాలకు చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది

200లకు పైగా స్టాళ్లలో మన రక్షణ సంస్థలు అభివృద్ధి చేసిన యంత్రాలు, ఆయుధాలను ప్రదర్శనలో ఉంచారు

దేశం నలుమూలల నుంచి 20 వేలకు పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు

























