
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షం బీభత్సం నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నడుం బిగించారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్న బాధితుల్ని రక్షించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్నారని, బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపించాలని బండి సంజయ్ రాజ్ నాథ్ సింగ్‌ను కోరారు. అందుకు రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం ఆదేశించింది. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు.