కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల | Rajnath releases commemorative coin in honour of Karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల

Aug 19 2024 5:43 AM | Updated on Aug 19 2024 6:58 AM

Rajnath releases commemorative coin in honour of Karunanidhi

సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అందుకున్నారు. 

డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్‌ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement