భారత్‌కు కొత్త అస్త్రం | What Is India Agni Prime Missile, Know About How It Works From Rail Based Launcher | Sakshi
Sakshi News home page

భారత్‌కు కొత్త అస్త్రం.. అగ్ని ప్రైమ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

Sep 25 2025 10:05 AM | Updated on Sep 25 2025 1:45 PM

What Is India Agni Prime Missile How It Works From Rail based launcher Details

సాక్షి, న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థ అరుదైన ఘనత సాధించింది. అగ్ని ప్రైమ్‌ (Agni-Prime) క్షిపణి ప్రయోగాన్నివిజయవంతంగా పూర్తి చేసుకుంది. రైల్వే నెట్‌వర్క్‌ నుంచి సైతం ప్రయోగించగలడం ఈ క్షిపణి ప్రత్యేకత.  రైలు ఆధారిత మొబైల్‌ లాంఛర్‌ వ్యవస్థ నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ గురువారం ఉదయం వెల్లడించారు. 

ఒడిశా తీరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐల్యాండ్‌ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. డీఆర్‌డీవో, Strategic Forces Command (SFC), భారత సైన్యం సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించాయి. దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా ఈ అడ్వాన్స్‌డ్‌ అగ్ని క్షిపణిని రూపొందించినట్లు రక్షణ శాఖ చెబుతోంది. రైలు నెట్‌వర్క్‌పై ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని చెబుతోంది. 

‘‘ఈ ప్రయోగం భారతదేశాన్ని అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు కలిగిన దేశాల వర్గంలో నిలిపింది. ఈ సందర్భంగా డీఆర్‌డీవ, ఎస్‌ఎఫ్‌సీ, సైన్యానికి అభినందలు’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement