రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తూ ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు సమస్యను పరిష్కరించడంలో భారత్ సహాయం చేయకపోతే ప్రస్తుతం ఉన్న సుంకాలను పెంచే అవకాశం ఉందని ట్రంప్ మరొకసారి హెచ్చరించారు.
భారత్‌తో వాణిజ్య లావాదేవీలపై సుంకాలను పెంచుతామన్నారు. ‘ భారత్ నన్ను సంతోష పెట్టాలనుకుంటోంది. భారత్ ప్రధాని నరేందర మోదీ చాలా మంచి వ్యక్తి.. ఉన్నతమైన వ్యక్తి. భారత్ వైఖరి పట్ల నేను సంతోషంగా లేననే విషయం మోదీకి తెలుసు’ అంటూ పేర్కొన్నారు.
#WATCH | On India’s Russian oil imports, US President Donald J Trump says, "... They wanted to make me happy, basically... PM Modi's a very good man. He's a good guy. He knew I was not happy. It was important to make me happy. They do trade, and we can raise tariffs on them very… pic.twitter.com/ANNdO36CZI
— ANI (@ANI) January 5, 2026
కాగా, భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు ట్రంప్. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్‌ను హెచ్చరించారు కూడా. భారత్‌పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంతో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్‌కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.
రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్‌గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్‌కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై మాట్లాడారు.. తాము భారత్‌కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్‌కు అసహనం తెప్పిస్తున్నాయి.
దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ‍్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్‌పై సుంకాల విధింపుల పెంపుతో తన అక్కసు తీర్చుకుంటున్నారు. మరొకసారి భారత్‌పై వాణిజ్య సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఒకవైపు మోదీ మంచి వ్యక్తి అంటూనే రష్యా చమురును ఆపకపోతే భారత్ మరొకసారి భారీగా తాము విధించే సుంకాల విధింపును ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.


