
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసిన వేళ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాదిపతులు, డిఫెన్స్ సెక్రటరీ,సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ కీలక భేటీలో కాల్పుల విరమణ, సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి చర్చ జరే అవకాశం ఉంది.
Delhi | Defence Minister Rajnath Singh held a meeting with Defence Secretary, CDS, Navy Chief and Army Chief
(Source: Defence Minister's office) pic.twitter.com/BF9AHZwkc4— ANI (@ANI) May 13, 2025
మధ్యాహ్నం 3గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పాక్ ఎయిర్ బేస్ ధ్వంసంపై కీలక విషయాలు వెల్లడించనుంది. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రక్షణ శాఖ బ్రీఫింగ్ ఇవ్వనుంది.