
సాక్షి, ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సోమవారం ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని జగన్‌ను కోరారాయన.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి భావిస్తోంది. ఇవాళో, రేపో అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించాలనుకుంటోంది. ఈ క్రమంలో.. పోటీ లేకుండా చూడాలని ఎన్డీయే కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే..
రాజ్‌నాథ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే వాళ్ల నుంచి సానుకూల స్పందన లభించనట్లు సమాచారం. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి రాజ్‌నాథ్ మద్దతు కోరారు. ఈ అంశంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని వైఎస్ జగన్ బదులిచ్చినట్లు తెలుస్తోంది.