బెంగళూరు: సిలికాన్ సిటీ గగనతలంలో యుద్ధ విమానాల విన్యాసాలు ఆకర్షించాయి
యలహంకలోని భారతీయ వైమానిక స్థావరంలో ఏరో ఇండియా–2025 సోమవారం అట్టహాసంగా ఆరంభమైంది
ఈ సందర్భంగా వివిధ దేశాల అత్యాధునిక విమానాల విన్యాసాలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఆహూతులను ఆకట్టుకున్నాయి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఏరో ఇండియాను ప్రారంభించారు
ఆయనతో పాటు రక్షణ శాఖ అధికారులు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ఎయిర్ షోను తిలకించారు. తరువాత ఇండియా పెవిలియన్‌లో రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను రాజ్‌నాథ్ ప్రారంభించారు


