
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.