భారత్‌తో బోర్డర్‌ టెన్షన్స్‌.. చైనా మంత్రితో రాజ్‌నాథ్‌ మాస్టర్‌ ప్లాన్‌ | India Suggests Plan To China To Manage Border Tensions, Check Out Story For Details | Sakshi
Sakshi News home page

భారత్‌తో బోర్డర్‌ టెన్షన్స్‌.. చైనా మంత్రితో రాజ్‌నాథ్‌ మాస్టర్‌ ప్లాన్‌

Jun 27 2025 10:52 AM | Updated on Jun 27 2025 12:03 PM

India suggests plan to China to manage border tensions

బీజింగ్‌: భారత్‌, డ్రాగన్‌ కంట్రీ చైనా మధ్య సరిహద్దుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్‌ సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌ సింగ్‌.. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌జున్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, కొత్త సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండటం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు, సరిహద్దుల గుర్తింపు-నిర్థారణ లక్ష్యాలను సాధించే విషయంపై చర్చించారు. అలాగే, ఇరు దేశాల మధ్య విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం వంటి నాలుగు అంశాలతో రాజ్‌నాథ్ ఈ ప్రణాళికను సూచించినట్టు తెలుస్తోంది. దీంతో, రెండు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో ఉద్రికత్తలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అరుణాచల్‌లో పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేసింది. దీన్ని భారత్‌ పలుమార్లు ఖండించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement