India border
-
పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)
-
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
War Live Updates..ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్విక్రమ్ మిస్త్రి, విదేశాంగ శాఖ కార్యదర్శిడీజీఎంఒల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారుదీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాంకాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్ దే బాధ్యతఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలిఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలిసీజ్ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్ సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్ లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025 What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025భారత్-పాక్ కాల్పుల విరమణను ధృవీకరించిన భారత్అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీఅమల్లోకి భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంసాయంత్రం 5 గంటల నుంచే అమలు: విక్రమ్ మిస్రీభారత్, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటనఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయిభారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ ఇరు దేశాలతో సుదీర్ఘంగా రాత్రంతా చర్చించాఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయిఇరు దేశాలకు కంగ్రాట్స్ pic.twitter.com/lRPhZpugBV— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025 బెంగళూరు నుంచి కళ్లి తండాకు మురళీ నాయక్ పార్థివదేహంపాకిస్తాన్ తో యుధ్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వీర జవాన్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆ జవాన్ పార్థివదేహాన్ని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా తరలిస్తున్నారు. రేపు(ఆదివారం) సైనిక లాంఛనాలతో వీర మరణం పొందిన ఆ జవాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ వీరమరణంపాక్ కాల్పుల్లో మరో జవాన్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) వీరమరణం పొందారు. ఈయన స్వగ్రామం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లాలోని తమ్లూర్.సైరన్ల శబ్దాలు వాడొద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచనసైరన్ల సౌండ్లతో.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందికేవలం అవగాహన కార్యక్రమాల్లోనే వినియోగించాలి ఢిల్లీ :32 విమానాశ్రయాలు మూసివేత9 మే 2025 నుండి 14 మే 2025 వరకు (15 మే 2025న 0529 IST వరకు) ఆపరేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేతభారత విమానాశ్రయాల అథారిటీ (AAI) సంబంధిత విమానయాన అధికారులు జారీ చేసిన ఎయిర్‌మెన్‌కు సూచనల (NOTAMs) వివరాలు 1 తాత్కాలిక విమానాశ్రయ మూసివేత: ◦ ప్రభావిత విమానాశ్రయాల జాబితా: ▪ అధంపూర్ ▪ అంబాలా ▪ అమృత్సర్ ▪ అవంతీపూర్ ▪ బఠిండా ▪ భుజ్ ▪ బికనీర్ ▪ చండీగఢ్ ▪ హల్వారా ▪ హిండన్ ▪ జైసల్మీర్ ▪ జమ్మూ ▪ జామ్‌నగర్ ▪ జోధ్‌పూర్ ▪ కాండ్లా ▪ కాంగ్రా (గగ్గల్) ▪ కేశోద్ ▪ కిషన్‌గఢ్ ▪ కుల్లూ మనాలి (భుంటర్) ▪ లేహ్ ▪ లూధియానా ▪ ముంద్రా ▪ నలియా ▪ పఠాన్‌కోట్ ▪ పటియాలా ▪ పోర్బందర్ ▪ రాజ్‌కోట్ (హిరాసర్) ▪ సర్సావా ▪ షిమ్లా ▪ శ్రీనగర్ ▪ థోయిస్ ▪ ఉత్తర్లై ◦ ఈ కాలంలో ఈ విమానాశ్రయాలలో అన్ని పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. ఆపరేషన్ సిందూర్.. ఐదుగురు టాప్ ఉగ్రవాదులు హతం26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్న భారత్.ముంబై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన భారత్.ఉగ్రస్థావరాలపై దాడిలో అబు జిందాల్ మృతిఐదుగురు టాప్ ఉగ్రవాదులను హతమార్చిన భారత్.ఆపరేషన్ సిందూర్ దాడుల్లో భాగంగా ఐదుగురు టాప్-5 టెర్రరిస్టులు హతం.ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం.మురిద్కే, బహవల్పూర్లో జరిగిన దాడిలో ఉగ్రనేతలు మృతి,మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం.అబు అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ చీప్ మునీర్.జైషీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్ హతంలష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్ యూసుఫ్ అజార్ హతం. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసఫ్ ఇవి మే 7వ తేదీ(బుధవారం అర్థరాత్రి) భారత్ మట్టుబెట్టిన ఉగ్రవాదులు వివరాలు Details of terrorists killed in the Indian strikes on 7th May in Pakistan: Sources 1) Mudassar Khadian Khas @ Mudassar @ Abu Jundal. Affiliated with Lashkar-e-Taiba. His funeral prayer was held in a government school, led by Hafiz Abdul Rauf of JuD (a designated global…— ANI (@ANI) May 10, 2025మోదీ హైలెవల్ మీటింగ్త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్ప్రధాని నివాసంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశంభేటీలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీ..పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్‌పై చర్చ.దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్ భేటీత్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీరాజ్నాథ్ భేటీలో పాల్గొన్న ఎన్ఎస్ఏ ధోవల్.సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లుఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడికొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలుశనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు Srinagar airport early morning pic.twitter.com/rK9diP6Xov— Maroof (@maroof2221) May 10, 2025పాక్‌కు భారీ నష్టం..పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులురెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులుభారత వైమానిక దాడుల్లో లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, పెషావర్, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.నూర్ఖాన్, ముర్షీద్, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్.భారత్ దాడులతో పాక్ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.కరాచీలోనూ భయంతో పాక్ ప్రజలు తరలి వెళ్తున్నారు.ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు బంద్.పాకిస్తాన్లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్.సియోల్కోట్లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్. అజిత్ దోవల్ భేటీ.. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్ దోవల్. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు. -
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి -
భారత్ భద్రతకు ఇస్రో భరోసా
-
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
భారత్‌కు అందే జలాలపై ప్రతికూల ప్రభావం ఉండదు
బీజింగ్: భారత్‌తో సరిహద్దుల్లోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలా శయాన్ని నిర్మించే ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్, బంగ్లాదేశ్‌లకు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం, భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండదని పేర్కొంది. కచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాతే ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది. పైపెచ్చు, ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతోపాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటు నిస్తుందని చెప్పుకొచ్చింది. పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా నిర్ణయించడంపై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. చైనా తీరుపై అమెరికా ప్రభుత్వంతోనూ చర్చిస్తోంది. -
సరిహద్దుల్లో బంగ్లా డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించింది. టర్కీలో తయారైన అధునాతన బేరక్తార్ టిబి2 డ్రోన్లను పశ్చిమబెంగాల్లోని సరిహద్దుల్లో బంగ్లాదేశ్ మోహరించింది. దాంతో భారత్ అప్రమత్తమైంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఉధృతమయ్యాయనే వార్తల నేపథ్యంలో భారత్ నిఘాను మరింత పెంచింది. బేరక్తార్ టిబి2 డ్రోన్ల మోహరింపునకు సంబంధించి భారత ఆర్మీ వాస్తవాలను బేరీజు వేస్తోంది. బంగ్లాదేశ్ ఇంటలిజెన్స్, సర్వైలెన్స్ 67 విభాగం ఈ డ్రోన్లను పర్యవేక్షిస్తోంది. రక్షణ చర్యల్లో భాగంగా ఈ డ్రోన్లను రంగంలోకి దింపామని బంగ్లా చెబుతున్నా పశ్చిమబెంగాల్‌తో వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో వీటిని మోహరించడంపై భారత్ అప్రమత్తమైంది. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయని, చొరబాటు ప్రయత్నాలు పెరిగాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చల ఫలితంగా సంబంధాలు మెరుగైనట్టు ఆయన తెలిపారు. భారత సరిహద్దుల విషయంలో కూడా కీలక పురోగతి నెలకొందని చెప్పుకొచ్చారు.ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్..‘భారత్-చైనా సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడుతూ..‘చైనా చర్యల కారణంగా 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు.2020 ఏప్రిల్‌లో తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా రెండు వైపులా మరణాలకు ఈ ఘర్షణ దారితీసింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కోసం భారతదేశం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో లడఖ్‌లోని భారత సరిహద్దుల నుంచి చైనా బలగాలు, భారత సైన్యం వెనక్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. గతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరుదేశాలకు ఏకాభిప్రాయం లేదు. పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు విషయాలపై చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు దీటుగా ప్రతిస్పందిస్తూనే, ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేశాం. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా ఇరు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. వీటికి సంబంధించి భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.#WATCH | In the Lok Sabha, EAM Dr S Jaishankar says "I rise to apprise the House of some recent developments in the India-China border areas and their implications for our overall bilateral relations. The House is aware that our ties have been abnormal since 2020 when peace and… pic.twitter.com/gmE3DECobq— ANI (@ANI) December 3, 2024 -
పాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా పాగా!
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ భారీ నిర్మాణాలు చేపట్టింది. పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తరముఖాన ఏకంగా 100 పైగా నిర్మాణాలను చేపట్టింది. సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా చైనా ఈ నిర్మాణాలను చేపట్టిందని భావిస్తున్నారు. శిఖరాల మాటున తమ నియంత్రిత టిబెట్ భూభాగంలో నిర్మిస్తున్న ఈ సైనిక స్థావరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. చట్టూ కొండలు ఉండటం మూలాన.. భూమి పైనుంచి దీనిపై నిఘా వీలుకాదు. చైనా సైన్యానికి ఫార్వర్డ్ బేస్ (సరిహద్దులకు సమీపంలో సైనిక మొహరింపునకు వీలు కల్పించే నిర్మాణం)గా పనికి వస్తుంది. టిబెట్– భారత్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు వద్ద 2020లో భారత్, చైనా సైన్యానికి ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టంభన నెలకొన్న ప్రదేశానికి తూర్పున 38 కిలోమీటర్ల దూరంలో చైనా 100 పైగా నిర్మాణాలను చేపట్టినట్లు ఉపగ్రహచిత్రాల్లో తేలింది. అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ తీసిన ఈ ఉపగ్రహచిత్రాల్లో 17 హెక్టార్ల విస్తీర్ణంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తక్షశిల ప్రొఫెసర్ వై.నిత్యానందం వెల్లడించారు. యెమగౌ రోడ్డులో 4,347 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీర్ఘచతురస్రాకారంలో 150 మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్ ఉందని, దీన్ని హెలికాప్టర్ల రాకపోకలకు వాడే ఉద్దేశం ఉండొచ్చని నిత్యానందం తెలిపారు. ఒక్కో దాంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది నివసించే విధంగా భవనాలను కడుతున్నారని వివరించారు. రెండు పెద్ద భవనాలు ఉన్నాయని.. వీటిలో ఒకటి పాలనా కార్యాలయంగా, మరొకటి గిడ్డంగిగా వాడే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక వరుస క్రమంలో కాకుండా గజిబిజిగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని, భవిష్యత్తులో క్షిపణిదాడులు జరిగితే నష్టం తీవ్రత తగ్గించేందుకే ఇలా చేస్తుండవచ్చని వివరించారు. పాంగాంగ్ సరస్సు భారత్– టిబెట్లను వేరు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఉప్పునీటి సరస్సు. -
భారత్ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు.అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు.#WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj— ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
భారత్ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు. అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు. #WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj — ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి!
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి! -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్‌కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్‌హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
‘డోక్లాం’ దేశ భద్రతకు పెనుముప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్చోక్, హాట్‌స్ప్రింగ్(కున్‌గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు. -
సరిహద్దుల్లో చైనా సైనికులు దిగుమతవుతున్నారు.. మన చేతుల్లో ఏముంది!
సరిహద్దుల్లో చైనా సైనికులు దిగుమతవుతున్నారు.. మన చేతుల్లో ఏముంది! -
నమ్మలేని పొరుగు దేశం
భారత–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత మరోమారు పార్లమెంట్ సహా దేశమంతటినీ కుదిపి వేస్తోంది. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద యాంగ్సే ప్రాంతంలో చొచ్చుకొని రావడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు గట్టిగా తిప్పికొట్టిన తీరుపై వైనవైనాలుగా కథనాలు వస్తున్నాయి. అక్కడ నిజంగా జరిగిందేమిటో తెలుసుకొని, పరిస్థితిని సమీక్షించి, లోటుపాట్లను సరిదిద్దుకొని, రక్షణ దళాలను బలోపేతం చేసే పనిలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఉంది. అయితే, సరిహద్దు వెంట శాంతి నెలకొనాలనీ, అనేక ఇతర అంశాల్లో సహకారం వెల్లివిరియాలనీ – ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని దశాబ్ద కాలంగా పొరుగుదేశం పదే పదే ఉల్లంఘించడం కీలకాంశం. పొరుగునే పొంచివున్న పాము పట్ల అప్రమత్తత అనివార్యం. రెండేళ్ళ క్రితం 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల్లోనూ, తాజా తవాంగ్ ఘటనలోనూ చైనా తన తప్పేమీ లేదనే భావన కలిగించడానికి శతవిధాల ప్రయత్నించింది. వాస్తవాలు వెలికి రావడంతో డ్రాగన్ పాచిక పారలేదు. భారత – చైనాల మధ్య సైనిక ఘర్షణ 1962 నుంచి 60 ఏళ్ళుగా సాగుతోంది. లద్దాఖ్ పరిసర పశ్చిమ ప్రాంతం – టిబెట్‌తో మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ల సరిహద్దుతో కూడిన మధ్యప్రాంతం – అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం... ఈ మూడూ భారత–చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు. అరుణాచల్‌తో ఉన్న 1126 కి.మీల తూర్పు సరిహద్దుపై చైనా ఎప్పుడూ పేచీ పెడుతూనే ఉంది. అరుణాచల్ తనదేనంటోంది. అధిక భాగాన్ని ‘దక్షిణ టిబెట్’ అని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది. అరుణాచల్‌పై రచ్చ రేపి, చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక అక్సాయ్చిన్ని తమకు వదిలేస్తే, అరుణాచల్‌పై పట్టు వీడతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహమని ఓ విశ్లేషణ. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవాంగ్ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు. 17వేల అడుగుల ఎత్తైన పర్వతప్రాంతాన్ని వశం చేసుకుంటే, ఎల్ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు. ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి, భారత్‌కు చోటు లేకుండా చేయాలన్నది చైనా పన్నాగం. అలాగే అరుణాచల్‌లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికీ తాజా చర్యకు దిగింది. అది ఫలించకపోవడంతో తవాంగ్‌లో ప్రస్తుతానికి భారత్‌దే పైచేయి. కానీ, మరోపక్క సిక్కిమ్ సరిహద్దులో 2017లో ఘర్షణ సాగిన కీలక డోక్లామ్ ప్రాంతంలో కొన్నేళ్ళుగా చైనా ఊళ్ళకు ఊళ్ళు కడుతోంది. వంతెనలు నిర్మిస్తోంది. ఇది ఆందోళనకరం. తవాంగ్‌లో 13 వేల అడుగుల ఎత్తైన చోట, మైనస్ 15 డిగ్రీల్లోనూ భారత్ నిర్మిస్తున్న సేలా సొరంగ మార్గం పూర్తి కావచ్చింది. ఇటు ప్రజలకూ, అటు ఆర్మీకీ పనికొచ్చే ఇలాంటివి చైనాను చీకాకుపరుస్తున్నాయి. ఆసియాపై ఆధిక్యం చూపాలంటే, హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం. పైగా, భవిష్యత్ దలైలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం. అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమనీ, అదీ తమ దేశంలో భాగమైపోవాలనీ చైనా తాప త్రయం. మరోపక్క బ్రహ్మపుత్రా నదిపై ప్రాజెక్ట్‌లు కడుతూ, ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది. ఇక, తవాంగ్ ఘటనలో భారత్‌ను అమెరికా సమర్థించడంతో పుండు మీద కారం రాసినట్టయింది. భారత, అమెరికాల బంధం బలోపేతమైతే తన ప్రాంతీయ ఆధిపత్యానికి గండి పడుతుందని చైనా భావన. అందుకే, ఢిల్లీ, వాషింగ్టన్లు దగ్గరవుతున్న కొద్దీ కవ్వింపు పెంచుతోంది. ప్రపంచవేదికలు శాంతివచనాలు పలుకుతున్నా, వాటి ప్రభావం శూన్యం. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై మన దేశమంతా ఏకతాటిపై ఉందని చాటాల్సిన సమ యమిది. కానీ తవాంగ్ ఘటన సైతం రాజకీయమవుతోంది. తమనూ విశ్వాసంలోకి తీసుకొని, సరిహద్దు రక్షణపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కారణాలేమైనా అధి కార బీజేపీ అంగీకరించట్లేదు. 1962 చైనా యుద్ధవేళ నెహ్రూ విధానాన్ని కాషాయధ్వజులు తప్పు పడున్నారు. అప్పట్లో నెహ్రూ సభలో చర్చించి, ఏకంగా 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశ మిచ్చి, ఆపైనే నిర్ణయం తీసుకున్నారని విస్మరిస్తే ఎలా అని కాంగీయులు ప్రతిదాడి చేస్తున్నారు. వెరసి, అప్పట్లో గల్వాన్ ఘటనలోనూ, ఇప్పుడీ తవాంగ్పైనా ఈ రాజకీయ వాగ్వాదపర్వం కీలకమైన దేశభద్రతలో లోటుపాట్లపై లోతైన చర్చకు దారి తీయకపోవడమే విచారకరం. సరిహద్దు వెంట చైనా లాగానే, టిబెట్, దక్షిణ మంగోలియా, హాంకాంగ్, తవాంగ్ లాంటి చోట్ల చైనాపై మనమూ దూకుడు చూపాలనేది కొందరి వాదన. అయితే, మన పాలకులు ‘ఆత్మనిర్భరత’ అంటూ రొమ్ము విరుచుకుంటున్నా, ఇవాళ్టికీ బొమ్మలు (86 శాతం), ఎలక్ట్రానిక్ విడిభాగాలు (37 శాతం), ఆటో విడిభాగాలు (30 శాతం) సహా అనేక అంశాల్లో మనం చైనా దిగుమతులపైనే ఆధార పడ్డాం. వస్తూత్పత్తిలో స్వీయపురోగతికి దీర్ఘకాలం పడుతుంది. అలా చూస్తే పొరుగున ఉన్న చైనాతో బద్ధశత్రుత్వంతో రోజులు గడవవు. దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే, నేటికీ స్పష్టంగా అంగీకారం లేని సరిహద్దు రేఖపై చర్చించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాలి. సరిహద్దుల్లో జరగనున్న భారత వైమానికదళ విన్యాసాలతో తోక తొక్కిన తాచులా చైనా బుసలుకొట్టవచ్చు. రానున్న రోజుల్లో ఉద్రిక్తతలూ పెరగవచ్చు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో సర్వర్లను స్తంభింపజేసిన సైబర్ దాడీ చైనా పనేనట. ఈ పరిస్థితుల్లో సైన్యం, భారత గూఢచారి దళాల అప్రమత్తతే మనకు రక్షాకవచం. -
సరిహద్దుల్లో కలకలం.. చెట్టుకు వేలాడుతూ అమ్మాయిల డెడ్‌బాడీలు
దేశ సరిహద్దుల్లో చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం సంచలనంగా మారింది. వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ ఘటన ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా ఠాకూర్గంజ్ వద్ద ఓ రేగు చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ ముగ్గురు మైనర్లు కనిపించారు. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వారిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ముగ్గురు మైనర్లు కరీనా గణేష్(16), కల్పనా గణేశ్(16), అంజలి గణేశ్(17).. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బసంత పాఠక్ తెలిపారు. ఈ మేరకు వారి పేరెంట్స్ మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, వీరు ముగ్గురు సుంకోషి టీ గార్డెన్లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. Three teenage girls have been found dead in mysterious circumstances in a tea estate in Jhapa.Karina Ganesh (16), Kalpana Ganesh (16) and Anjali Ganesh (17). They used to work for the tea estate there but were missing since Saturday morning.Police are taking the bodies in hospita pic.twitter.com/vL2Vxs3W5R — Santosh Bam (@SantoshBam8) July 24, 2022 ఇది కూడా చదవండి: ప్రియురాలు ఎంత పని చేసింది.. లవర్స్ ఇలా కూడా ఉంటారా! -
లవర్ కోసం నదిలో ఈది భారత్‌లోకి వచ్చింది.. ఆ తర్వాత ట్విస్ట్
వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. లవర్ కోసం ఎవరూ చేయని రిస్క్ ఆమె చేసింది. ఏకంగా దేశం సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో నిలిచింది. కానీ, ప్రభుత్వ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్ (22) అనే యువతి ప్రియుడి కోసం సరిహద్దులు దాటింది. ఫేస్బుక్ ద్వారా కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది. అతని కోసం సరిహద్దుల్లో రాయల్ బెంగాల్ పులుల నివాసమైన దట్టమైన సుందర్బన్ అడవుల గుండా ప్రయాణించి, గంటపాటు నదిలో ఈది భారత్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో మూడు రోజుల క్రితం అభిషేక్‌ను పెళ్లాడింది కూడా. అయితే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే నేరంపై పోలీసులు కృష్ణ మండల్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్ హై కమిషనర్‌కు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఇలాగే తనకిష్టమైన చాక్లెట్ కోసం సరిహద్దుల్లో నదిని ఈది భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని కూడా అధికారులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: మెట్రో రైలులో యువతి హంగామా.. వీడియో వైరల్ -
సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం మరో కుట్రకు తెరలేపింది. మెక్‌మోహన్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుమారు 65 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తమదేనంటూ వాదించేందుకు సరిహద్దులకు అత్యంత సమీపంలో మూడు వరకు గ్రామాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్‌లో ఒకవైపు భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూనే మరోవైపు ఈ ప్రణాళికను అమలు చేసింది. భారత్–చైనా–భూటాన్ సరిహద్దులు కలిసే బూమ్లా కనుమకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ గ్రామాలను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సహా అన్ని వసతులను కల్పించింది. అన్ని వేళలా ప్రయాణించేందుకు వీలుండే రహదారులను నిర్మించింది. హన్ చైనీయులు, టిబెట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశుపోషకులను ఈ గ్రామాల్లోకి తరలించింది. 2017లో భారత్– చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో, భూటాన్ భూభాగంలో కొన్ని గ్రామాలను చైనా అక్రమంగా నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడైన వారానికే ఈ పన్నాగం బయటపడటం గమనార్హం. క్రమక్రమంగా సరిహద్దులకు సమీపంలోకి చొచ్చుకువచ్చి తిష్టవేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ 2017లోనే అప్పటి ఆర్మీ చీఫ్, ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించడం గమనార్హం. అరుణాచల్ సరిహద్దుల వెంట ఉన్న భూభాగం అంతా తమదేనని వాదించేందుకు చైనా ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని విశ్లేషకుడు డాక్టర్ బ్రహ్మ చెల్లనీ అంటున్నారు. భారత్ మాత్రం మెక్‌మోహన్ రేఖే సరిహద్దులకు ప్రాతిపదిక అంటూ తిప్పికొడుతోంది. ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి? ప్లానెట్ ల్యాబ్స్ నుంచి ఎన్డీటీవీ సంపాదించిన నివేదికను బట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఉపగ్రహ చిత్రాన్ని బట్టి భారత సరిహద్దులకు సమీపంలోని కొండలపై 20 వరకు ఇళ్లున్న ఒకే ఒక్క గ్రామం ఉంది. నవంబర్ 28వ తేదీన ఉపగ్రహం పంపిన రెండో చిత్రంలో అక్కడికి సమీపంలోనే మరో 50 వరకు ఇళ్ల నిర్మాణాలు కనిపిం చాయి. మరో 10 ఇళ్ల నిర్మాణా లతో మరో ప్రాంతం కూడా అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. మొత్తంగా చైనా ఆ ప్రాంతంలో కనీసం మూడు గ్రామాలను నిర్మించినట్లు తేలింది. చైనా అధికార గ్లోబల్ టైమ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ గ్రామాల్లో ఉండే పశుపోషకులు సరిహద్దులను కాపలా కాస్తుంటారని కూడా పేర్కొంది. ఫిబ్రవరి 17న తీసిన తొలి చిత్రంలో కొత్తగా నిర్మించిన గ్రామాలు (వృత్తంలో) నవంబర్ 28 నాటి రెండో చిత్రంలో కొత్తగా వెలిసిన నివాసాలు (వృత్తంలో) -
భారత ఆర్మీకి భయపడి ఏడ్చిన చైనా జవాన్లు!
బీజింగ్: భారత్-చైనా సరిహద్దుల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్‌లోని 20 ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మెహరించింది. ఈ నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌కు బస్సులో వెళుతున్న చైనా జవాన్లు.. మనసులో బాధను బయటకు కక్కలేక, మింగలేక తెగ అవస్థ పడుతున్నారు. అదే సమయంలో భావోద్వేగంగా సాగే 'గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ద ఆర్మీ' అనే మిలిటరీ పాటకు గొంతు కలుపుతూ కన్నీళ్లు కార్చారు. ఈ వీడియో తైవాన్ మీడియా కంటపడటంతో డ్రాగన్ దేశానికి తనదైన శైలిలో చురకలు అంటించింది. (చదవండి: చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్) "సరిహద్దులో గస్తీ కాయడానికి వెళ్తున్న చైనా జవాన్లు భారత సైన్యంతో తలపడేందుకు భయపడి ఏడుస్తున్నారు" అంటూ కథనాలు రాసింది. అసలే భారత్ పేరు వింటేనే తోక తొక్కిన తాచులా లేస్తున్న చైనాకు ఈ కథనాలు అస్సలు మింగుడు పడలేదు. దీంతో తైవాన్ కథనాలను ఖండిస్తూ.. తమ యువ సైనికులు అప్పుడే వారి కుటుంబాలకు తొలిసారిగా వీడ్కోలు పలికి వస్తున్నందువల్లే కంటతడి పెట్టుకున్నారని చైనా వివరణ ఇచ్చింది. పైగా వారు పాడుతుంది చైనా మిలిటరీ సాంగ్ కావడంతో సహజంగానే ఉద్వేగానికి లోనయ్యారని స్పష్టం చేసింది. ఇక ఈ వీడియోను అన్హూయ్ ప్రావిన్స్‌లోని ఫుయాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో చిత్రీకరించారు. (చదవండి: ఇండియన్ అవెంజర్స్ వచ్చేశారు) 上车后被告知上前线 炮灰们哭的稀里哗啦!pic.twitter.com/wHLMqFeKIa — 自由的鐘聲🗽 (@waynescene) September 20, 2020 -
చైనా దుస్సాహసం జిన్‌పింగ్ ఆలోచన
వాషింగ్టన్: భారత్ సరిహద్దుల్లో ఇటీవలి చైనా దుశ్చర్యలకు వ్యూహరచన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌దేనని తాజాగా వెల్లడైంది. తన భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రమాదకర ఎత్తుగడకు జిన్‌పింగ్ తెరతీశారని, అయితే, భారత సైనికులు వీరోచితంగా ఎదురు నిలవడంతో ఆ వ్యూహం విఫలమైందని అమెరికాకు చెందిన పత్రిక ‘ద న్యూస్‌వీక్’ పేర్కొంది. ఈ వైఫల్యం విపరిణామాలను జిన్‌పింగ్ ఎదుర్కోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. అయితే, దీన్ని కారణంగా చూపి సైన్యంలోని విరోధులకు చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నించవచ్చని వెల్లడించింది. అలాగే, భారత్‌పై సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగవచ్చని పేర్కొంది. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే, చైనా వైపు కూడా మరణాలు సంభవించినప్పటికీ.. ఆ సంఖ్యను చైనా నేటికీ వెల్లడించలేదు. ఆ ఘర్షణల్లో చైనాకు చెందిన కనీసం 43 మంది సైనికులు చనిపోయి ఉంటారని తాజాగా న్యూస్‌వీక్ పేర్కొంది. ఆ సంఖ్య గరిష్టంగా 60 వరకు ఉండొచ్చని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్‌కు చెందిన క్లియొ పాస్కల్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది. ఐదు దశాబ్దాల్లో తొలిసారి గత నెలలో చైనా ఆర్మీపై భారత సైనికులు దుందుడుకుగా ముందుకువెళ్లి, కీలక పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నారని, ఇది చైనా సైనికులను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆ కథనంలో న్యూస్‌వీక్ పేర్కొంది. గతంలో చైనా ఆధీనంలో ఉన్న మూడు కీలక ప్రాంతాలను తాజాగా భారత్ కైవసం చేసుకుందని వెల్లడించింది. ముఖాముఖి ఘర్షణల్లో చైనా గ్రౌండ్ ఫోర్స్‌కు ఘన చరిత్ర ఏమీ లేదని, వియత్నాంతో యుద్ధంలో ఓటమిని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించింది. భారత సైనికులు కొత్తగా నూతనోత్తేజంతో కనిపిస్తున్నారని, దూకుడుగా ఎదురుదాడికి దిగుతున్నారని ప్రశంసించింది. -
భారత్-నేపాల్ వివాదం.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ఎగువసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా.. కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. (నేపాల్‌తో వివాదంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు) నేపాల్ ప్రభుత్వం ఏపీఎఫ్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ఉద్ధేశించిన ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే లిపులేఖ్ రహదారిపై నేపాల్ ‘వేరొకరి కోరిక మేరకు’ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ వివాదస్పద బిల్లును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్ మండిపడింది. (ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం) -
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. -
సరిహద్దుల్లో మొబైల్ నెట్వర్క్ సేవలు నిలిపివేత
ఢాకా : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ సేవలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ టెలికాం ఆపరేటర్లు పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కిలోమీటర్ పరిధిలో మొబైల్ నెట్వర్క్ సేవలు నిలిపి వేయాలనే నిర్ణయం తీసుకున్నామని సోమవారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సీఏఏ చట్టం తీసుకు వచ్చిన అనంతరం ఈ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముస్లింలు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించవచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్‌ల నిలిపివేత ప్రభావం దాదాపు 1 కోటి మందిపై పడుతుందని అంచనా. -
మన భూభాగంలోకి చైనా సైన్యం రాలేదు
న్యూఢిల్లీ: లడఖ్‌లో సరిహద్దులు దాటి చైనా సైన్యం చొచ్చుకువచ్చిందన్న వార్తలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఆధ్యాత్మిక గురువు దలై లామా 84వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన కొందరు టిబెటన్లు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఉత్సవాలు జరుపుకున్నారని, ఆ సందర్భంగా వారు టిబెటన్ పతాకాలను ఎగురవేశారని తెలిపారు. ఆ సమయంలో భారత్ భూభాగంలోని వాస్తవ నియంత్రణ రేఖను దాటేందుకు యత్నించిన చైనా సైనికులను తాము అడ్డుకున్నామన్నారు. దీంతో వారు అక్కడ జరుగుతున్న ఉత్సవాలను గమనించి, అర్థగంట తర్వాత వెనక్కి వెళ్లిపోయారన్నారు. అంతేతప్ప, చైనీయులు ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బదులిస్తామని, ఉగ్ర చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వేతర శక్తులు బలపడి ఉగ్ర చర్యలకు పాల్పడుతుండటం కొత్త పరిణామం అని అన్నారు. -
పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్‌కు చెందిన 7 సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్ పరిధిలోని రాజౌరీలో పాక్ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. ఇందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి రాక్‌చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ విభాగం తెలిపింది. -
చొరబాటుదారుడిపై బీఎస్ఎఫ్ కరుణ
జమ్మూ: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి తుపాకీ కాల్పులకు గాయపడిన యువకుడిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్‌లోని భోల్లియన్ డా కొథే గ్రామానికి చెందిన ఫరూఖ్ అహ్మద్ సైనికులు హెచ్చరిస్తున్నా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. దీంతో సైనికులు అతనిపై కాల్పులు జరపగా బుల్లెట్ తగిలి పడిపోయాడు. చనిపోయాడని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన సిబ్బంది.. అతను బతికే ఉండటంతో వైద్యశాలకు తరలించారు. అతని వద్ద ఆయుధాలు లభించలేదనీ, మాదకద్రవ్యాల మత్తులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
నేడు భారత్‌కు గీత
కరాచి: ఏడేళ్ల వయసులో పొరపాటున భారత్ సరిహద్దు దాటి దశాబ్ద కాలంగా పాకిస్తాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి బాలిక గీత నేడు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనుంది. ఉదయం 8 గంటలకు ఆమె ఢిల్లీ చేరుకోనుంది. ఇస్లామాబాద్‌లోని భారత్ కార్యాలయం పంపిన ఫోటోలో నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను ఆమె గుర్తించింది. దీంతో ఆమెను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అవి సరిపోలితే గీతను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. పాక్‌లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు కూడా భారత్‌కు వస్తున్నారు. -
టిబెట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం!
భారత సరిహద్దుకు సమీపంలో నిర్మించిన చైనా బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం(ఫొటో ఓల్టాయిక్ పవర్ స్టేషన్)ను టిబెట్‌లో చైనా నిర్మించింది. భారత సరిహద్దు(వాస్తవాధీన రేఖ)కు సమీపంలో టిబెట్‌లోని ఎన్గరీ ప్రిఫెక్ఛర్లో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని చైనా పూర్తిచేసినట్లు ఈ మేరకు గురువారం ఆ దేశ జాతీయ వార్తా సంస్థ ‘జిన్హువా’ వెల్లడించింది. ఈ 10-ఎంవీ పీవీ పవర్ స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, గ్వాడియన్ లాంగ్వాన్ టిబెట్ న్యూ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయని తెలిపింది. 23.8 హెక్టార్లలో ఏర్పాటుచేసిన పది మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడపనున్నారని, ఈ ప్లాంటు 25 ఏళ్లపాటు పనిచేస్తుందని పేర్కొంది.