
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ (India) తరఫున ఆప్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్, ఆప్ఘన్‌తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్ విషయంలో ఆప్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
🚨🚨 Pakistan is prepared for 2 front war: Khawaja Asif
Anchor: According to war analysts, India might play dirty games along the border. Are you anticipating that?
Khawaja Asif: No, absolutely, you cannot rule that out. There are strong possibilities. pic.twitter.com/ixIU7ClFrJ— Naren Mukherjee (@NMukherjee6) October 17, 2025
అంతకుముందు కూడా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్‌లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’