Woman Swims To India From Bangladesh For Her lover, Viral - Sakshi
Sakshi News home page

Facebook Love: ఫేస్‌బుక్‌ లవ్‌.. లవర్‌ కోసం నదిలో ఈది భారత్‌లోకి వచ్చాక.. షాకింగ్‌ ట్విస్ట్‌

Jun 1 2022 7:19 AM | Updated on Jun 1 2022 10:08 AM

Woman Swims To India From Bangladesh For Her lover - Sakshi

ఫేస్‌బుక్‌ ప్రేమ.. తన లవర్‌ కోసం ఏకంగా నదిని ఈది భారత్‌లోని వచ్చింది. తీరా ఇండియాలోకి వచ్చాక అనుకోని ట్విస్ట్‌.

వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. లవర్‌ కోసం ఎవరూ చేయని రిస్క్‌ ఆమె చేసింది. ఏకంగా దేశం సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో నిలిచింది. కానీ, ప్రభుత్వ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌ (22) అనే యువతి ప్రియుడి కోసం సరిహద్దులు దాటింది. ఫేస్‌బుక్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన అభిక్‌ మండల్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది. అతని కోసం సరిహద్దుల్లో రాయల్‌ బెంగాల్‌ పులుల నివాసమైన దట్టమైన సుందర్బన్‌ అడవుల గుండా ప్రయాణించి, గంటపాటు నదిలో ఈది భారత్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతాలోని కాళీఘాట్‌ ఆలయంలో మూడు రోజుల క్రితం అభిషేక్‌ను పెళ్లాడింది కూడా. 

అయితే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే నేరంపై పోలీసులు కృష్ణ మండల్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌కు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఇలాగే తనకిష్టమైన చాక్లెట్‌ కోసం సరిహద్దుల్లో నదిని ఈది భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని కూడా అధికారులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

ఇది కూడా చదవండి: మెట్రో రైలులో యువతి హంగామా.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement