టిబెట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం! | Sakshi
Sakshi News home page

టిబెట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం!

Published Fri, Nov 22 2013 3:25 AM

టిబెట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం!

భారత సరిహద్దుకు సమీపంలో నిర్మించిన చైనా
 బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం(ఫొటో ఓల్టాయిక్ పవర్ స్టేషన్)ను టిబెట్‌లో చైనా నిర్మించింది. భారత సరిహద్దు(వాస్తవాధీన రేఖ)కు సమీపంలో టిబెట్‌లోని ఎన్‌గరీ ప్రిఫెక్ఛర్‌లో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని చైనా పూర్తిచేసినట్లు ఈ మేరకు గురువారం ఆ దేశ జాతీయ వార్తా సంస్థ ‘జిన్హువా’ వెల్లడించింది. ఈ 10-ఎంవీ పీవీ పవర్ స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, గ్వాడియన్ లాంగ్వాన్ టిబెట్ న్యూ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయని తెలిపింది. 23.8 హెక్టార్లలో ఏర్పాటుచేసిన పది మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడపనున్నారని, ఈ ప్లాంటు 25 ఏళ్లపాటు పనిచేస్తుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement