నేడు భారత్‌కు గీత | India today to Geetha | Sakshi
Sakshi News home page

నేడు భారత్‌కు గీత

Oct 26 2015 2:43 AM | Updated on Sep 3 2017 11:28 AM

నేడు భారత్‌కు గీత

నేడు భారత్‌కు గీత

ఏడేళ్ల వయసులో పొరపాటున భారత్ సరిహద్దు దాటి దశాబ్ద కాలంగా పాకిస్తాన్‌లో నివసిస్తున్న మూగ, చెవిటి బాలిక గీత నేడు

కరాచి: ఏడేళ్ల వయసులో పొరపాటున భారత్ సరిహద్దు దాటి దశాబ్ద కాలంగా పాకిస్తాన్‌లో నివసిస్తున్న మూగ, చెవిటి బాలిక గీత నేడు ఎట్టకేలకు  స్వదేశానికి చేరుకోనుంది. ఉదయం 8 గంటలకు ఆమె ఢిల్లీ చేరుకోనుంది.  ఇస్లామాబాద్‌లోని భారత్ కార్యాలయం పంపిన ఫోటోలో నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను ఆమె గుర్తించింది. దీంతో ఆమెను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇక్కడ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి అవి సరిపోలితే గీతను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. పాక్‌లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు కూడా భారత్‌కు వస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement