పెట్రోల్‌ ధరలు దిగొస్తున్నాయి..

 Petrol prices have started falling: Dharmendra Pradhan

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజల్లో ఆందోళనలు పెరిగి నిరసనలు పెల్లుబుకుతుండగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తాజాగా ఓ ప్రకటన చేశారు. పెట్రోల్‌ ధరలు తగ్గు ముఖం పట్టడం మొదలైందని చెప్పారు. 'ధరలు తగ్గడం మొదలైంది. గత రెండు రోజుల్లోనే పెట్రోల్‌ తగ్గడం మొదలయ్యాయి' అని ఆయన చెప్పారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇర్మా, హార్వీ తుఫానుల కారణంగా పెట్రోలియం మార్కెట్‌ ధరల్లో సమతౌల్యం దెబ్బతిన్నదని, అందువల్లే ధరలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్‌టీ విధించే విషయాన్ని తాను కూడా సమర్థిస్తున్నానని, అయితే, ప్రజల ప్రయోజనాలను మాత్రం తప్పక దృష్టిలోమ పెట్టుకుంటామని, ప్రజల అభీష్టాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని ఆయన తెలిపారు. 'ఇప్పటికే మేం జీఎస్టీ మండలికి పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్‌టీ వేయాలని ప్రతిపాదించాం. ఇది ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటుంది.బ అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా భద్రత ఉంది' అని ఆయన చెప్పారు.    
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top