జీఎస్టీలోకి పెట్రోల్‌తో సామాన్యులకు ఊరట

Petroleum products need to be brought under GST, says Dharmendra pradhan - Sakshi

పట్నా/న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల్ని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తేనే సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయన్నారు. బిహార్‌లోని బెహరీ నియోజకవర్గంలో రెండో విడత ఉజ్వల యోజనను శుక్రవారం ప్రారంభించాక మీడియాతో మాట్లాడారు.

‘సిరియా అంతర్యుద్ధం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తామన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. జీఎస్టీ వచ్చి ఏడాదైనా కాకముందే తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీలో శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.74.08కి చేరుకుంది. 2013, సెప్టెంబర్‌ తర్వాత పెట్రోల్‌ ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top