NEET-2021: నీట్‌ పరీక్ష తేదీ ఖరారు!

NEET-UG 2021 Dates Announced By Union Education Minister Dharmendra Pradhan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఖరారు చేశారు. కోవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ పాటిస్తూ సెప్టెంబర్‌ 12 న నీట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను  జులై 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.

కోవిడ్‌-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top