తెలంగాణకు మరిన్ని కేంద్ర సంస్థలు | Dharmendra Pradhan Inaugurated IInvenTiv 2024 in Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరిన్ని కేంద్ర సంస్థలు

Jan 20 2024 3:49 AM | Updated on Jan 20 2024 3:14 PM

Dharmendra Pradhan Inaugurated IInvenTiv 2024 in Hyderabad - Sakshi

ఇన్వెంటివ్‌–2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

సాక్షి, హైదరాబాద్‌: డిజిటైజేషన్, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ మెథడాలజీ, ఆన్‌లైన్‌ అప్రోచ్, డిజిటల్‌ నెట్‌ వర్కింగ్‌ వంటి అంశాలకు సంబంధించి తెలంగాణలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. తెలంగాణలో ఇటీవలే రూ.వెయ్యి కోట్ల తో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రాచీన భారతం ఎన్నో ఆవిష్కరణలకు భూమికగా నిలిచిందని.. ఆధునిక భారతం విశ్వమిత్రగా వ్యవహరి స్తోందని పేర్కొన్నారు.

‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్‌’ నినాదంతో దేశయువత భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ లీడర్‌గా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థల రెండో ఎడిషన్‌ ‘ఇన్వెంటివ్, ఆర్‌అండ్‌డీ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌’ను ధర్మేంద్ర ప్రధా న్‌ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థలు కలిపి మొత్తం 53 విద్యా సంస్థల నుంచి 120 ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టారు. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, క్లైమేట్‌ చేంజ్, ఈ–మొబిలిటీ, క్లీన్‌ ఎనర్జీ, డిఫెన్స్‌ అండ్‌ స్పేస్, ఇండస్ట్రీ 4.0 తదితర ఇతివృత్తాలతో వీటిని రూపొందించారు. 

దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతాం 
ప్రజల రోజువారీ జీవితంలో ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఐఐటీలకు ప్రధాని మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గుర్తు చేశారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న కల సాకారంలో స్టార్టప్‌ కంపెనీలు వెన్నెముకగా నిలుస్తాయని..     ఇన్వెంటివ్‌–2024 వంటి సమావేశాలు రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడతాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు మరింత పెరిగేలా విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ అంతా సహకారం అందించాలని కోరారు.

దేశ జీడీపీలో కనీసం 25 శాతా నికి దోహదపడేలా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. ఆ దిశగానే ‘మేక్‌ ఇన్‌ ఇండియా, ఇన్వెస్ట్‌ ఇన్‌ ఇండియా, పీఎల్‌ఐ స్కీమ్, ఎఫ్‌డీఐ లిబరలైజేషన్‌’వంటి విధానాలను కేంద్రం తీసుకొచి్చందన్నారు. డిజిటల్‌ పబ్లి క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డొమైన్‌లో 46 శాతం గ్లోబల్‌ డిజి టల్‌ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని, మనదేశం ఇన్నోవేషన్‌కు ఇంక్యుబేటర్‌గా మారిందని చెప్పారు. 2014లో 350 స్టార్టప్‌ కంపెనీలు ఉంటే.. ఇప్పుడవి లక్షా 20వేలకు చేరాయన్నారు. 

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు 
విద్యార్థుల ఆత్మహత్యలు సమాజానికి మంచిది కా దని కేంద్ర మంత్రి అన్నారు. ఐఐటీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement