బయో ఫ్యూయల్‌ విమానం- కీలక మైలురాయి

India  First Test Flight Powered by Bio-Fuel  by SpiceJet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం గాల్లోకి ఎగరడంతో  రికార్డ్‌ నమోదైంది.  బయో ఫ్యూయల్ ఆధారిత మొదటి విమానం దేశంలో టెస్ట్‌  ఫ్లైని విజయవంతంగా  పూర్తి చేసింది. ప్రైవేట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ విమానం (బాంబార్డియర్‌ క్యూ400 టర్బోప్రోప్‌) సోమవారం డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. 

ఢిల్లీలోని టెర్మినల్‌2లో బయో ఫ్యూయల్‌ విమానాన్ని రిసీవ్‌ చేసుకున్నామని పెట్రోలియం శా​ఖామంత్రి ధరేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. ఇందుకు స్పైస్‌జెట్‌, ఏవియేషన్‌ అధారిటితోపాటు,  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్, ఛత్తీస్‌గఢ్ బయో ఫ్యూయెల్ డెవలప్మెంట్ అథారిటీ ( సిబిడిఎ) డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టీ) తదితరులకు  అభినందనలు  తెలిపారు. ఈ బయో మిషన్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో భాగంగా త్వరలోనే పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక  కొత్త బయో-ఏటీఎఫ్‌పాలసీ తీసుకురానున్నామని వెల్లడించారు.  కార్బన్ ఉద్గారాలను నియంత్రించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంలో భాగంగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీ, సురేష్‌ ప్రభు, హర్హవర్దన్‌, జయంత్‌ సిన్హా  తదితరులు హాజరయ్యారు.

జీవ ఇంధనంతో నడిచేవిమాన సర్వీసులను మన దేశంలో లాంచ్‌ చేయడం ఇదే ప్రథమం. కాగా అమెరికా, ఆస్ట్రేలియాలాంటిఅభివృద్ధి చెందిన దేశాలే వీటిని నిర్వహిస్తున్నాయి.  పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్‌ లేదా పెట్రోల్‌కు స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఎథనాల్‌ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top