దేవుడా.. రాహుల్‌కు మంచి బుద్ధి ప్రసాదించు! | May God give him better sense | Sakshi
Sakshi News home page

దేవుడా.. రాహుల్‌కు మంచి బుద్ధి ప్రసాదించు!

Oct 24 2017 3:55 PM | Updated on Aug 15 2018 6:34 PM

May God give him better sense - Sakshi

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ రాహుల్‌ గాంధీమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అంటే గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ధర్మేంద్రప్రధాన్‌ ఎదురు దాడి చేశారు. భగవంతుడా.. రాహుల్‌ గాంధీకి కాస్త మంచి బుద్ధి ప్రసాదించు.. అంటూ ప్రధాన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది జెన్యూన్‌ సింపుల్‌ టాక్స్‌అని.. మోదీది.. గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై బీజేపీ తీవ్రంగా ఎదురు దాడి ప్రారంభించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు దేశప్రజలు ఆమోదించారు అని ఆయన అన్నారు. జీఎస్టీ అనేది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా గతంలో రాహుల్‌ గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement