ఐఐటీలకు విదేశాల నుంచి విజ్ఞప్తులు | Foreign Countries Request setting up IITs there Says Centre | Sakshi
Sakshi News home page

రండి.. మా దగ్గర ఐఐటీలను ఏర్పాటు చేయండి: కేంద్రానికి విదేశాల నుంచి విజ్ఞప్తులు

Oct 15 2022 1:59 PM | Updated on Oct 15 2022 1:59 PM

Foreign Countries Request setting up IITs there Says Centre - Sakshi

ఐఐటీ క్యాంపస్‌లను నెలకొల్పాలంటూ పలు అభివృద్ధి చెందుతున్న..

న్యూఢిల్లీ: ఐఐటీ క్యాంపస్‌లను నెలకొల్పాలంటూ పలు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని ఆయన అన్నారు.

ఇవి కేవలం ఐఐటీలుగానే కాదు, పరివర్తన సాధనాలుగా కూడా మారాయన్నారు. ఐఐటీ –ఢిల్లీలో శుక్రవారం ఆయన రెండు రోజుల ఇన్వెంటివ్‌ ఫెయిర్‌ను ప్రారంభించి ప్రసంగించారు. ప్రతిభ, మార్కెట్‌ పరిమాణం, కొనుగోలు శక్తి వంటివి దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాయని, మన ఐఐటీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement