త్వరలో కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం

Dharmendra Pradhan Meets YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఎన్‌ఎమ్‌డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


చమురు కంపెనీలకు రాష్ట్రంలో వనరుల ఆదాయాల మేరకు సీఎస్‌ఆర్‌ నిధులు చెల్లించాలని నిర్ణయించారు. తూర్పు గోదావరిలోని ముమ్మిడివరం ప్రాంతంలో మత్య్సకారులకు చెల్లించాల్సిన రూ. 81 కోట్లను త్వరలో చెల్లిస్తామని ఈ సందర్భంగా ఓఎన్‌జీసీ అంగీకరించింది. కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్న స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ. 2లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. అంతకుముందు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమావేశమయ్యారు అయ్యారు. ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top