టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు | TRS MLAs Are In Touch Says K laxman | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

Nov 14 2019 6:03 AM | Updated on Nov 14 2019 6:03 AM

TRS MLAs Are In Touch Says K laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని, అడ్డదారిలో అధికారంలోకి రావాలని తాము అనుకోవడం లేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మున్సిపల్‌ ఎన్నికల్లో కేంద్రం అమలు చేస్తున్న పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఆర్టీసీ పెట్రోల్‌ బంక్‌లను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టిన విషయంపై స్వయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుస్తానని లక్ష్మణ్‌ తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, కొత్త అధ్యక్షుడు ఎవరనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుందని లక్ష్మణ్‌ చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement