
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల సభలో తమకు కిక్కు రావడం లేదని, కేసీఆర్ వస్తే మజా వస్తదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం(ఆగస్టు2) రాజగోపాల్‌రెడ్డి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షనేత హోదా కేటిఆర్, హరీశ్‌లలో ఎవరికి ఇచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ ఆగం అవుతుందన్నారు. ‘హరీశ్ రావు వర్కర్ ..కానీ ఆయనకు ఇవ్వరు.
కేటీఆర్‌కు అవగాహన లేదు. విద్యుత్ మీద డిస్కషన్‌లో కేసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. కేసిఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. ఆయన ఊహల్లో బతుకుతుండు అని రాజగోపాల్‌రెడ్డి సెటైర్లు వేశారు.