చంద్రబాబు ఐదువేల కోట్ల స్కాంపై బొత్స విమర్శలు | Botsa Satyanarayana Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఐదువేల కోట్ల స్కాంపై బొత్స విమర్శలు

Feb 2 2026 2:35 PM | Updated on Feb 2 2026 3:58 PM

Botsa Satyanarayana Fires on CM Chandrababu

సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో దమనకాండపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో.. నారాలోకేష్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొత్స ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ సోమవారం (2-2-2026) మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత మూడ్రోజులుగా కూటమి సర్కార్‌ విధ్వాంసానికి పాల్పడింది. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా? దాడుల్ని ప్రోత్సహించి అప్రతిష్టను మూటగట్టుకోవద్దు చంద్రబాబు. చంద్రబాబు ఏది చెబితే పోలీసులు అది చేస్తారా? రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు స్పందించలేదు. కేంద్ర మంత్రే స్వయంగా తడాఖా చూపిస్తాం అని అంటున్నారు. కేంద్రమంత్రి హుందాగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌సీపీ బెదరదు. రాష్ట్రంలో జరిగే దాడులను ప్రజలు గమనిస్తున్నారు.

ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి చంపాలని అనుకుంటున్నారా?.ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే ఆలోచించాలి. పోలీసులు వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. తప్పులు చేస్తుంటే దేవుడు క్షమించరు. సంక్షేమాన్ని గాలికొదిలేసి దాడులకు తెగబడతారా?. సంపద సృష్టి పేరుతో వైజాగ్‌లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. రాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు.  
 Botsa : రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?

Advertisement
 
Advertisement
Advertisement