‘చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?’ | YSRCP Leader Sailaja Nath Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?’

Feb 2 2026 2:01 PM | Updated on Feb 2 2026 2:11 PM

YSRCP Leader Sailaja Nath Slams Chandrababu

అనంతపురం: కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.... బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు.  అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు ప్రతిపాదనలు కేంద్రం బుట్టదాఖలు చేసిందని... కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాబట్టడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘెరంగా విఫలమైందని శైలజానాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా అని ఆయన ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేయించే బదులు... రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement