సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట | APSFL Case: Big Relief For Sakshi TV In Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట

Feb 2 2026 2:02 PM | Updated on Feb 2 2026 3:48 PM

APSFL Case: Big Relief For Sakshi TV In Supreme Court

సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్‌నెట్‌లో సాక్షి చానెల్‌ తొలగించడంపై విచారణ జరపాలని డీటీ శాట్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సాక్షిపై కక్షగట్టి.. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్‌కు భారీ షాక్‌ తగిలినట్లైంది. 

ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫైబర్‌ నెట్‌ నుంచి సాక్షి టీవీ చానెల్‌ను తొలగించారు. పైగా సాక్షి టీవీని ప్రసారం చేయొద్దంటూ ఎంఎస్‌వోలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ తొలగింపు వ్యవహారంపై సాక్షి యాజమాన్యం టీడీశాట్‌, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో టీడీశాట్‌కు ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. 

అయితే.. టీడీశాట్‌ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్‌ను టీడీ శాట్‌ విచారణ జరపనుంది. 

టీడీ శాట్ లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని వెల్లడి

టీడీశాట్‌ (TDSAT) అంటే Telecom Disputes Settlement and Appellate Tribunal. ఇది భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, అప్పీలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం.

 

 

Advertisement
 
Advertisement
Advertisement