నేడు వైఎస్సార్‌సీపీ కీలక సమావేశాలు | Jungle Raj in AP: YSRCP Sajjala Botsa Key Meeting News Updates | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ కీలక సమావేశాలు

Feb 2 2026 11:39 AM | Updated on Feb 2 2026 11:54 AM

Jungle Raj in AP: YSRCP Sajjala Botsa Key Meeting News Updates

సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఆరాచకాలు తారాస్థాయికి చేరి వైఎస్సార్‌సీపీ నేతలపై, నివాసాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. అలాగే తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలోనూ మరో సమావేశం నిర్వహించనుంది.

కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, టీడీపీ గూండాల హింసాకాండపై సజ్జల, బొత్స.. జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. యధేచ్చగా సాగుతున్న అరాచకాలను అహింసా మార్గంలో ఎదుర్కొవడం.. చట్టపరమైన ఫిర్యాదులు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. 

బ్రాహ్మణ నాయకులతోనూ.. 
తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ విష ప్రచారం ముదుతున్న వేళ.. బ్రహ్మణ నేతలతోనూ సజ్జల, బొత్స భేటీ కానున్నారు. తిరుమల మహా ప్రసాద అంశంతోపాటు కూటమి ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైనంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement