రెచ్చిపోతున్న టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ స్వాతి | TDP Social Media Activist Swathi Reddy Post On Ambati Rambabu | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ స్వాతి

Feb 2 2026 10:24 AM | Updated on Feb 2 2026 7:30 PM

TDP Social Media Activist Swathi Reddy Post On Ambati Rambabu

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  తెలుగుదేశం సోషల్‌ మీడియా కార్యకర్త స్వాతిరెడ్డి (స్వాతిచౌదరి) అత్యుత్సాహం ప్రదర్శించారు. అంబటి రాంబాబు అరెస్ట్‌ నేపథ్యంలో  సోషల్‌ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఆదివారం ఆమె చేసిన ఓ పోస్టు.. అంబటి హత్యకు కుట్రపన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు అంబటి రాంబాబు దొరికి ఉంటే ఈపాటికి ఆయన అంత్యక్రియలు పూర్తయి ఉండేవంటూ ఆదివారం స్వాతి ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టు కలకలం రేపింది. గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై శనివారం సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటలకు వరకు జరిగిన విధ్వంసకాండలో గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకం అంటూ స్వాతి తన పోస్టులో పేర్కొంది. అంతటితో ఆగకుండా.. 

వైసీపీ వాళ్లు రామచంద్రరావును ఏదో చేస్తామని ఆయన ఫొటోను సేవ్‌ చేసుకుంటున్నారని.. ‘మీరు అనుకున్నట్లుగా ఆయన వ్యక్తి కాదురా.. కనపడని శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగుపెట్టాడు. ఆయన దగ్గరకు వెళ్లాలంటే చాలా సైన్యాన్ని దాటుకుని వెళ్లాలి’ అంటూ రెచ్చగొట్టే పోస్టులు చేస్తోందామె.

Advertisement
 
Advertisement
Advertisement