పదోతరగతి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా
ఏప్రిల్ 2న పరీక్ష నిర్వహణ
నేడు యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు
సాక్షి, అమరావతి: రంజాన్ సెలవును ఈనెల 21వ తేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత మార్చి 20న ప్రభుత్వం రంజాన్ సెలవుగా ప్రకటించింది. మతపెద్దల నిర్ణయం మేరకు 21వ తేదీ శనివారం రంజాన్ పర్వదినాన్ని నిర్వహిస్తున్నందున, ఆ రోజు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. కాగా శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షను ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


