బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.
జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్ పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో మెుకామా ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా నుండి పోటీ చేసి గెలిచింది.


