బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి కొత్త సర్కార్ ఖరారైంది. మిత్రం పక్షం జేడీయూ నేత బిహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకరం చేశారు. నితీష్‌తోపాటు మొత్తం 27 గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రెండు దశాబ్దాల తర్వాత నితీష్ కీలకమైన హోంమంత్రి పదవిని బీజేపీకి త్యాగం చేయడం విశేషంగా నిలిచింది. దీంతో కూటమి ప్రభుత్వంలో బీజేపీ పట్టు సాధించి, డ్రైవింగ్ సీటు వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పటివరకు నితీష్ కుమార్ వద్ద ఉన్న హోంమంత్రి పదవిని బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపికి చెందిన సామ్రాట్ చౌదరికి కేటాయించారు. రెండు దశాబ్దాల తర్వాత కీలకమంత్రి పదవిని నితీష్ తన డిప్యూటీకి అప్పగించడం చర్చకు దారితీసింది. కాగా నితీష్ కుమార్ డిప్యూటీలలో మరొకరు విజయ్ కుమార్ సిన్హాకు గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖతో పాటు భూమి మరియు రెవెన్యూ శాఖను అప్పగించారు. మంగళ్ పాండే ఆరోగ్యం, న్యాయ శాఖలకు నాయకత్వం వహిస్తారు, దిలీప్ జైస్వాల్ పరిశ్రమ మంత్రిగా నియమితు లయ్యారు.
చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!


