బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ కుమార్ బిహార్‌కు మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా (ఎక్స్ ద్వారా) తన శుభాకాంక్షలను తెలియజేశారు.
జేడీయూ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్ గురువారం పట్నాలోని గాంధీ మైదానంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Heartiest congratulations to Shri @NitishKumar Ji on taking oath as Chief Minister of Bihar! Wishing you the very best for a successful tenure!
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2025
సీఎం నితీష్ కుమార్‌తో పాటు జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి, శ్రావణ్ కుమార్, లేషి సింగ్, మొహ్మద్ జమాఖాన్, బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ సింగ్, రామనిషాద్, నితిన్ నబీన్, అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, లఖేంద్ర కుమార్ రోషన్, నారాయణ ప్రసాద్, శ్రేయసి సింగ్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీనికిముందు నితీష్ ఎన్‌డీఏ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నుంచి అనుమతి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం


