విశాఖ: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత కచ్చితంగా మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు.
భోగాపుర ఎయిర్‌పోర్ట్ కోసం భూ సమీకరణ, భూ వివాదాలను పరిష్కరించింది వైఎస్ జగనేనని, భూసేకరణ బాధితుల పరిహారం కోసం రూ. 1100 కోట్లు కేటాయించారన్నారు. 2023, మే 3వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వైఎస్ జగన్ శంకస్థాపన చేశారని, 2025 డిసెంబర్ నెలాఖరుకు మొదటి ఫ్లైట్ ల్యాండ్ చేయాలనే టార్గెట్‌ను జీఎంఆర్‌కు అప్పగించారన్నారు.
వైఎస్ జగన్ టార్గెట్ లో భాగంగానే రేపు తొలి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 14 న ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని, 2700 ఎకరాలకు గాను 250 ఎకరాలను కూడా చంద్రబాబు సేకరించలేదన్నారు. వైఎస్ జగన్ కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.


